అధికారులు అంకితభావంతో సేవలందించాలి : పినపాక ఎమ్మెల్యే

by Aamani |
అధికారులు అంకితభావంతో సేవలందించాలి : పినపాక ఎమ్మెల్యే
X

దిశ, గుండాల : అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే సందర్భంలో అంకితభావంతో పనిచేసే ప్రజలకు సేవలు అందించి ప్రజల మనల్ని పొందాలని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రగతి పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని వీడి మారుమూల ప్రాంతమైన గుండాల మండలం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు పెండింగ్లో ఉన్న పనులు సత్వరమే పూర్తి చేయాలని కొత్తగా ప్రతిపాదించిన పనులకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు క్షేత్రస్థాయిలో అధికారులు మంచిగా పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు సానిటేషన్ రెగ్యులర్ గా నిర్వహించాలని వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు.

ఇరిగేషన్ అధికారులు పెళ్లి వాగు ప్రాజెక్టు అంచనాలు తయారు చేసి వెంటనే ఇవ్వాలని కోరారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొడవటం 7 మెలికల వాగు బ్రిడ్జి, పడుకోవడం దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించి సమర్పించాలని కోరారు. అనంతరం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. అంగన్వాడి ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యవంతం చేసి పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గుండాల గ్రామంలో నిర్మించ తలపెట్టిన బతుకమ్మ ఘాట్ స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలు వైద్యాధికారి మనీష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మధు,మండల ప్రత్యేక అధికారి కుర్షిత్, తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీవో ఎస్ వి సత్యనారాయణ, ఎంపీ ఓ శ్యాంసుందర్ రెడ్డి, ఎంఈఓ కృష్ణయ్య. పంచాయతీ రా డి ఈ.రామనాథం, సీఐఎల్ రవీంద్ర, ఎస్సై రాజమౌళి, కాంగ్రెస్ నాయకులు, ఎస్.కె ఖదీర్, అబ్దుల్ నబీ, చాట్ల పద్మ, పొలుబోయిన ముత్తయ్య, కోడెం ముత్తయ్య, బుచ్చయ్య, దారా అశోక్, పల్లపు రాజేష్, ఇస్రాత్, అఫ్రోజ్, చంద్రశేఖర్, తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed