social media : అంతా నా ఇష్టం.. ఎస్సై మా చుట్టం...?

by Sumithra |
social media : అంతా నా ఇష్టం.. ఎస్సై మా చుట్టం...?
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టింగులు పెడుతూ గ్రామానికి, ఆంధ్రాకు సంబంధి ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని... టార్గెట్ చేస్తూ... మానసికంగా శారీరకంగా... ఇబ్బందులు గురిచేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతూ...' అంతా నా ఇష్టం... బూర్గంపాడు ఎస్ఐ మా చుట్టం... మా సామాజిక వర్గం... అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారం పై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ మధ్యకాలంలో అదే గ్రామానికి చెందిన కొంత మందిని టార్గెట్ చేస్తూ మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఉపసర్పంచిని.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ పార్టీకి చెందిన మోరంపల్లి బంజర అభిమానులను టార్గెట్ చేస్తూ అభ్యంతరకరంగా పోస్టింగులు పెట్టడంతో పాటు తనకు తెలిసిన ఇరువురు మిత్రులతో కలిసి ఇలాంటి పోస్టింగులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఈ విషయం పై గ్రామానికి చెందిన కొంత మంది యువకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఆ యువకుడిని నిలదీసి అడగగా 'అంతా తన ఇష్టమని.. మీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోండంటూ సవాలు విసిరాడు. సోషల్ మీడియాలో.. స్టేటస్ లో ఈ యువకుడు పెడుతున్న పోస్టింగుల పై మనోవేదన గురైన కొంతమంది ఇటీవల కాలంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న బూర్గంపాడు నూతన ఎస్సై రాజేష్ ఇలాంటి పోస్టులు భవిష్యత్తులో పెట్టడంటూ చెప్పి ఇరువర్గాలను పంపించేశారు. అదేవిధంగా పెట్టిన పోస్టింగ్లు డిలీట్ చేయటంతో పాటు తన తప్పయింది అంటూ మన్నించాలంటూ అదే సోషల్ మీడియాలో.. అదే స్టేటస్ లో ఆ యువకుడు పెడతాడంటూ ఎస్సై చెప్పటంతో గ్రామస్తులు... వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మోరంపల్లి బంజర వాసులు సరేలే మన గ్రామానికి చెందిన కుర్రాడు కదా అంటూ సర్దుకొని వచ్చేశారు.

ఎస్ఐ మా చుట్టం... మా సామాజిక వర్గం..

సోషల్ మీడియాలో స్టేటస్ లో అభ్యంతర పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న ఆ యువకుడిలో మార్పు వస్తుందనుకున్నా.. మార్పు రాకపోగా ఎస్ఐ మా చుట్టం... మా సామాజిక వర్గం... ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మరల పోస్టింగ్లు పెట్టటంతో బంజరలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ద్వారా ప్రస్తుతం అతని సామాజిక వర్గానికి చెందటంతో ఆ రీతిగా సామాజిక వర్గ పరిచయంతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యువకుడు చక్రం తిప్పినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యువకుడితో పాటు కేంద్ర రాజకీయ పార్టీకి చెందిన మరో అధ్యక్షుడితో పాటు ఇదే విధంగా ఇదే రీతిలో పోస్టింగ్లు పెడుతూ మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారు.

పట్టించుకోని పోలీసులు...కొరవడిన నిఘా..

సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టే వ్యవహారం పై సంబంధిత పోలీసులు పట్టించుకోక పోవడంతో పాటు నిఘా వ్యవస్థ కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి యువకుల పైశాచిక పోస్టింగులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం సైతం ఇదే రీతిగా ఈ బంజరకు చెందిన ఈ యువకుడు పెట్టిన పోస్టింగ్ల పై తీవ్ర అభ్యంతరాలకు గురై మానసిక వేదన గురవుతున్నా ఈ గ్రామానికి చెందిన వారు జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెల్లదీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బూర్గంపాడు పోలీసులకు తెలిసినప్పటికీ తమకేమీ పట్టనట్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed