- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Balram : రూ. 22 వేల కోట్లు పక్క దారి పట్టించిన మంత్రి హరీష్ రావు
దిశ,ఇల్లందు : హరితహారం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిన రూ. 22 వేల కోట్లను మాజీ మంత్రి హరీష్ రావు అధికారుల సహకారంతో పక్కదారి పట్టించారని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆరోపించారు. ఆదివారం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ హరితహారానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిధులైన రూ. 22 వేల కోట్లు పక్కదారి పట్టాయని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
దానికి సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉందని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు 40 శాతం స్టైఫెండ్ పెంచడం సంతోషకరమని, ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అసలు పోరాడలేదని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.