MLA Payam Venkateswarlu : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నడూ అన్యాయం చేయదు

by Aamani |
MLA Payam Venkateswarlu : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నడూ అన్యాయం చేయదు
X

దిశ,మణుగూరు : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎప్పుడు మోసం చేయదని రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నాయకులు రైతుల పేరుతో,సీతారామ ప్రాజెక్టు సాగునీరు వంకతో చేతకాని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.బుధవారం ప్రజా భవన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్మించలేదని మేము ఎన్నడైనా అన్నామా. వారి పరిపాలనలో ప్రాజెక్టు డిజైన్ మాత్రమే చేయబడింది.అప్పటికి ప్రాజెక్టుగా పూర్తిగా నిర్మించలేదు.ఇది తెలుసుకున్న ప్రజలు బీఆర్ఎస్ చేసిన పరిపాలన చాలులే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు త్వరగా సాగునీరు అందించాలని దృఢసంకల్పంతో కోట్ల రుపాయలతో మిగిలిన పనులు పూర్తి ప్రాజెక్ట్ పంపు హౌస్ ప్రారంచే దశలో బీఆర్ఎస్ నాయకులు అర్ధరహితం రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.బీఆర్ఎస్ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం, అసత్య ప్రచారాలు చేస్తూ రోడ్లెక్కుతున్నారు.రైతులను,సీతారామ ప్రాజెక్ట్ సాగునీరును అడ్డం పెట్టుకొని పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.గత ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి జిల్లాను గానీ,భద్రాద్రి రైతులను గానీ పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.భద్రాద్రి రామునికే టోపీ పెట్టిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి కనీసం సీతారామ ప్రాజెక్ట్ పనులను కూడా పూర్తి చేయలేదని అసమర్ధత బీఆర్ఎస్ ప్రభుత్వందని వెక్కిరించారు.

సీతారామ ప్రాజెక్ట్ సాగునీరు భద్రాద్రి జిల్లాకు ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు కావాలనే సీతారామ ప్రాజెక్ట్ సాగునీరు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని,భద్రాద్రి రైతులకు అన్యాయం చేస్తున్నారని ముగ్గురు మంత్రులపై,ప్రభుత్వంపై సిగ్గులేని రాజకీయం చేస్తున్నారన్నారని ఆరోపించారు.ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధి రాకపోతే ఎలా..! గత ప్రభుత్వ నాయకులు గుర్తు చేశారు.సీతారామ ప్రాజెక్ట్ విషయంలో రోడ్లెక్కి రాజకీయం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేన్నారు. ఇప్పటికైనా ప్రజల మధ్య పద్ధతిగా బ్రతకితే పదేళ్ల లైఫ్ ఉంటుంది..లేదంటే ప్రజలకు దూరంగా సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఎమ్మెల్యే పాయంతో పాటు మండల అధ్యక్షుడు పీరాణాకి నవీన్,కాటబోయిన నాగేశ్వరావు,గాండ్ల సురేష్,సర్వేశ్, కోటేశ్వరావు,బల్లెం సురేష్,శేఖర్, కటుకూరి శ్రీనివాస్, తమ్మిశెట్టి సాంబ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed