హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు: కొత్తగూడెం జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పూ

by Shiva |   ( Updated:2023-02-17 13:52:14.0  )
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు:  కొత్తగూడెం జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పూ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా సెషన్స్ కోర్టు న్యాయకమూర్తి కే.చంద్రశేఖర ప్రసాద్ తన తీర్పును వెలువరించారు. పాల్వంచ పట్టణ పరిధిలో నివాసంముండే మల్లెల నాగేశ్వర రావు హత్య కేసులో వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో విచారణ అధికారిగా సీఐ షుకూర్ వ్యవహరించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్ సూచనలతో నేరస్థులకు ఖచ్చిత్తంగా శిక్ష పడేలా కృషి చేశారు.

అదేవిధంగా ఈ కేసులో ముఖ్య సాక్షులకు ఇటీవల జిల్లా ఎస్పీ డా.వినీత్ ధైర్యాన్ని నింపి నిందుతులకు శిక్ష పడేలా చేశారు. కోర్టు వారికి సరైన పత్రాలు సమర్పించడమే కాక, నిందితులకు శిక్ష పడే వరకు పోలీసులు కృషి ఉంది. ఇదే విధంగా ప్రతిఒక్క కేసులో సాక్షులు ముందుకొచ్చి ధైర్యంగ నిజం చెప్పి నిందితులకు శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాధాకృష్ణ, పాల్వంచ సీఐ నాగరాజు, ఎస్సైలు నరేశ్, ప్రవీణ్, కోర్టు కానిస్టేబుల్ వెంకయ్యను జిల్లా ఎస్పీ వినీత్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed