- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అధికారి సస్పెన్షన్ హాస్యాస్పదం.. LHPS ఉపాధ్యక్షుడు
దిశ, ఖమ్మం మయూరి సెంటర్ : అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందని LHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ అన్నారు. ఇటీవలే రఘునాథపాలెంలోని చింతగుర్తి అటవీ ప్రదేశంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డీ శ్రీనుపై జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ్ సస్పెన్షన్ వేటు వేయడంపై బద్రు స్పందిస్తూ శనివారం ఓ ప్రకటన చేశారు. గత రెండు నెలలుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విధులకు వెళ్లకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసినట్లు అటవీ శాఖ అధికారి పేర్కొన్నారని, కానీ దీని వెనుక రాజకీయ పలుకుబడి, ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిని వదిలేసి తమ శాఖకు చెందిన ఉద్యోగిని సస్పెన్డ్ చేయడం విచిత్రంగా ఉందని అన్నారు.
ఈ ఉద్యోగి మాత్రమే కాకుండా ఇతర అధికారులకు ఇందులో బాగం లేదా ఉంటే వారిని కూడా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాలాకాలంగా అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, కానీ ఈ విషయం అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి రాకపోవడం విశ్వసించలేమని అన్నారు. గిరిజన సామాజికవర్గానికి చెందిన కిందిస్థాయి ఉద్యోగి కాబట్టి అతడిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై జవాబు చెప్పాలని కోరారు. బహుజన వాదులు, ప్రజాస్వామిక వేదాలతో పాటు మేధావులు ఉద్యోగ సంఘాలు దీనిపై స్పందించాలని సూచించారు.
ఇలా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తే భవిష్యత్తులో ఏ ఉద్యోగి కూడా చిత్తశుద్ధితో నిష్పక్షపాతంగా ఉద్యోగం చేయలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంపదను కాపాడితే సస్పెన్షన్‌ను బహుమతిగా ప్రకటిస్తే నీతి, నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి శిక్ష ఉంటుందని దీని ద్వారా అటవీశాఖ ఉన్నతాధికారులు సంకేతాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉద్యోగి సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.