మణుగూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: Rega Kantha Rao

by Kalyani |   ( Updated:2022-12-30 11:00:12.0  )
మణుగూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: Rega Kantha Rao
X

దిశ, మణుగూరు: మణుగూరు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో త్వరలోనే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని దానికి సంబంధించి మున్సిపల్ అధికారులతో శుక్రవారం చర్చించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందు ఉండాలని, మున్సిపాలిటీలు గ్రామపంచాయతి అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఏఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed