రిపోర్టర్ ప్రాణాలు కాపాడిన శివరామకృష్ణ

by S Gopi |
రిపోర్టర్ ప్రాణాలు కాపాడిన శివరామకృష్ణ
X

దిశ, తిరుమలాయపాలెం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ పత్రిక విలేకరికి పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించిన ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కిమ్స్ హస్పటల్ డైరెక్టర్ చావా శివరామకృష్ణ. మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఎల్. ప్రవీణ్ కుమార్ ఈ నెల రెండో తేదీన తన బైక్ పై, ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళుతూ.. తిరుమలాయపాలెంలోని ఖమ్మం-వరంగల్ ప్రధాన హైవేపై రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు గాడిదని ఢీ కొన్న ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. గమనించిన సమీపవాసులు కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపి, 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రవీణ్ కి మెరుగైన వైద్యం అవసరమని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో, పేద కుటంబమైన ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అంతా స్థోమత లేదు. ఏమి చేయాలో పాలుపోక ఖమ్మం నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేశారు.

హాస్పిటల్ డైరెక్టర్ చావా శివరామకృష్ణ ప్రత్యేక చొరవతో ప్రవీణ్ తలకు సుమారు రూ. మూడు లక్షల విలువైన సర్జరీని ఉచితంగా చేపించారు. 15 రోజులపాటు ఐసీయూలోనే వైద్యుల పరివేక్షణలో ఉంచి మెరుగైన వైద్యం అందించారు. ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ప్రాణపాయంలో ఉన్న విలేకరికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, సుమారు రూ. 4 లక్షల వరకు హస్పిటల్ ఫీజు అయినప్పటికీ పూర్తి ఉచితంగా అందించిన కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ చావా శివరామకృష్ణ మంచికి ఆధ్యులుగా నిలిచాడు. ప్రవీణ్ కు భార్య, నాలుగు, రెండోవ క్లాస్ చదువుతున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శివరామకృష్ణ ప్రత్యేక చొరవ ద్వారానే ప్రవీణ్ కి పునర్జన్మ దక్కిందని.. కుటుంబసభ్యులతోపాటు తిరుమలాయపాలెం మండలానికి చెందిన వివిధ పత్రిక విలేకరులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story