కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ భవనం లీకేజ్.. ఎటు చూసిన తడి నీటి మడుగులు

by Aamani |
కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ భవనం లీకేజ్.. ఎటు చూసిన తడి నీటి మడుగులు
X

దిశ,కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సంబంధించిన ఆర్టీసీ బస్టాండ్ లీకేజ్ కి నిలయంగా నిలిచింది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా బస్టాండ్ స్లాబ్ తడిసి స్లాబ్ బీముల నుంచి వర్షపు నీరు లీకేజీ అయి ప్లాట్ ఫామ్ లపై పారుతుండడంతో పాటు తడిసి ఉండడంవల్ల అధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం ప్లాట్ ఫాం తడిసి ఉండడం మూలంగా ఈగలు దోమలు ముసురుతో ప్రయాణికులతో పాటు వచ్చే సహాయకులు సైతం బేజారవుతున్నారు. స్లాబ్ కు గోడలకు విద్యుత్ వైరింగ్ పరిచి ఉండగా వైరింగ్ మొత్తం లీకేజీ నీటిలో నానుతుంది. దీనివల్ల ప్రమాదం మంచిగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

వర్షాల మూలంగా వరద నీటితో విద్యుత్తుతో అప్రమత్తంగా ఉండాలని పాలకులు సూచిస్తున్నప్పటికీ బస్టాండ్ లో వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం మూలంగా ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో ఎటు చూసినా నీటిమడుగులు ఉండడంవల్ల నడవలేని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు అసహనం చేస్తున్నారు. కనీసం నీటిమడుగుల విషయంలో ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడం విచారకరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చెల్లించలేని దుస్థితి నెలకొందని పలువురు మండిపడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఆర్టీసీలో వాతావరణం దారుణం: సీపీఎం నాయకులు భూక్య రమేష్...

కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ లో వాతావరణం చూస్తే భయాందోళన కలిగిస్తుంది. ఆర్టీసీ భవనం నుంచి వర్షం నీరు లీకేజీ కాకుండా చర్యలు చేపట్టాలి. విద్యుత్ వైరింగ్ వర్షపు నీటిలో పడటం వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఆవరణలో ఎటు చూసినా నిల్వ ఉన్న వర్షపు నీటితో మడుగులు కనిపిస్తున్నాయి. ఈగలు దోమలు లేకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. ప్రయాణికుల ఆరోగ్య విషయంలో అధికారులు శ్రద్ధ చూపాలి.

Advertisement

Next Story