ఖమ్మం కమలానిదే

by Disha Web Desk 15 |
ఖమ్మం కమలానిదే
X

దిశ, ఖమ్మం టౌన్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో కమలం విజయం ఖాయమని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే కారేపల్లి మండలంలో ఐదు మంది ఎంపీటీసీలు, 20 మంది తాజా మాజీ సర్పంచులు, 50 మంది వార్డ్ మెంబర్స్, రఘునాథపాలెం మండలంలోని పలువురు గిరిజన ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీ ల నుంచి బీజేపీ లో చేరారు. ఖమ్మంలో జరగబోతున్న పెను మార్పులో తామంతా భాగస్వాములం కావాలని బీజేపీలో చేరినట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. ఎన్నికల ప్రచారంలో నైనా ప్రజలను కలుసుకోకుండా ఏసీ గదుల్లో కూర్చుంటున్న ఆ పార్టీ నేతల నిజ స్వరూపాన్ని ప్రజలు అర్థంచేసుకోవాలని అన్నారు. బంజారా సోదర, సోదరీమణులు పెద్ద సంఖ్యలో బీజేపీ లో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

గిరిజన నాయకులు కృష్ణ రాథోడ్, జాటోత్ మోహన్, రవి రాథోడ్ నాయకత్వంలో పార్టీలో చేరారు. మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్న తీరుకు ముగ్ధుడినై సేవారంగం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ఖమ్మం ఎంపీ గా ఒక్క అవకాశం కల్పిస్తే కేంద్రం నుంచి అన్ని పథకాలు, ఎన్నో నిధులు రప్పించి అభివృద్ధి సాధిస్తానని వినోద్ రావు చెప్పారు. తక్కువ సమయంలోనే ప్రజల నుంచి తనకు లభించిన స్పందన అపూర్వమని, ఇందుకు సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఖమ్మం ను ఎలా అభివృద్ధి చేసుకోవాలో బైట నుంచి వచ్చిన వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు గెలిస్తే వారి పర్సనల్ గా డెవలప్ అవుతారని, వారి బిజినెస్ మీద ఫోకస్ చేసి ప్రజలను అశ్రద్ధ చేస్తారని అన్నారు. కాంగ్రెస్ కు 30 నుంచి 40 ఎంపీ సీట్లు కూడా దాటవని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 400 సీట్లతో ఏర్పాటు చేస్తుందన్నారు. మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రామారావు మాట్లాడుతూ..

బంజారా సోదరులు పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. అయోధ్య రామ జన్మభూమి లో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో 500 ఏళ్ల హిందువుల కల సహకారం అయిందన్నారు. తెలంగాణలో గెలిచే సీట్లలో ఖమ్మం మొదటి వరసలో ఉంటదన్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా మోడీ కోసం ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ 100 కు 100 శాతం ఖమ్మం పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గెలుస్తారని చెప్పారు. ధరం సోహ మౌనిక, భానోత్ శంకర్ పాటి మీద గుంపు, ధరావత్ రాజు, కెలోత్ భారతి, గూగులోత్ కృష్ణ, తేజావత్ రమేష్వ ర్ల మహేశ్వరరావు, దార్లోతి చందర్, ఎంపీటీసీ భానోత్ సురేష్, అజ్మీరా వీరన్న, మాజీ మండల ప్రధాన కార్యదర్శి భనోత్ వెంకటయ్య నాయక్, వైరా, భాణోత్ బాలు నాయక్, జిల్లా వేదిక ఇంచార్జి చాగంటి కోటశ్వరరావు, మాజీ సొసైటీ వైస్ చైర్మన్భా నోత్ మదన్ , భానోత్​ భావ్ సింగ్, మాజీ వార్డ్ మెంబర్ వాంకోడోత్ శివ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ భానోత్​ కృష్ణ, మాజీ విద్యా కమిటీ వైస్ చైర్మన్ భానోత్​ రమేష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ మాలోత్ బాలు తదితరులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.

Next Story

Most Viewed