ఖమ్మం, కేంద్రంలో బీజేపీ దే అధికారం

by Disha Web Desk 15 |
ఖమ్మం, కేంద్రంలో బీజేపీ దే అధికారం
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం లో, కేంద్రం లో మళ్లీ బీజేపీదే అధికారమని, మరోసారి మోడీ రావడం ఖాయమని తమిళనాడు కర్ణాటక సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము ఎంతమంచి చేయాలన్నా ప్రజల వరకు తీసుకుని వెళ్లాలి అంటే మీడియా సహకారం కావాలన్నారు. నిన్నటి నుండి ప్రచారం ప్రారంభించామని, ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సుమారు 420 పైగా సీట్లు గెలుస్తుందన్నారు. అందులో ఖమ్మం సీటు కూడా ఉంటుందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని, ఎక్కడికి వెళ్లినా నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రేపు, ఎల్లుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. నరేంద్ర మోడీని మూడవసారి గెలిపించేందుకు వారి వంతు ప్రచారం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని, ఈ నంబర్ 9505439505 కు మేసేజ్ చేస్తే వారిని నరేంద్ర మోడీ సైన్యంలో కలుపుకుంటామన్నారు.

ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా వినోద్ రావు సీటు పొందడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సైలెంట్ వేవ్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నడుస్తుందని తెలిపారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వ్యక్తి వినోద్ రావు అని, దేశ హితంగా, సమాజ హితంగా పని చేసే వ్యక్తి అన్నారు. భారత దేశ కీర్తిని విదేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. విపక్ష పార్టీలు, ఇండి కూటమి వారు స్కాంలు చేస్తూ జైలుకు వెళ్తున్నారని అన్నారు. రైతులకు, మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఏకైక నాయకత్వం బీజేపీ అన్నారు. తమిళనాడులో మూడేళ్ల క్రితం గో బ్యాక్ మోడీ అన్నవాళ్లు ఇప్పుడు వాంగ (రండి) మోడీ అని స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభ వేదికగా బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేయాలి అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలంగాణకు 7 లక్షల కోట్ల నిధులు మంజూరు చేశామని, 5వ ఎకానమీగా ఉన్న భారత దేశం మూడవ స్థానానికి ఎదగాలంటే బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలి అన్నారు. నరేంద్ర మోడీకి బహుమతిగా ఖమ్మం సీటు కూడా గెలిపించి ఇవ్వాలన్నారు. సేవ చేస్తున్న, చేయాలి అనుకునే వ్యక్తి తాండ్ర వినోద్ రావు అని, ఆయనను గెలిపించి మరింత సేవ చేసేందుకు సహకరించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​కు ఓటు వేసినా వృథానే అని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ లో చేరి ఆంధ్రాలో కలిసి పని చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కూడా కలిసి పని చేసి బీజేపీని గెలిపిద్దాం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ, శ్యామ్ రాథోడ్, నున్న రవి, అల్లిక అంజయ్య తదితరులు ఉన్నారు.


Next Story