- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం జిల్లాల్లో దారుణం.. తిరుపతి లడ్డూ ప్రసాదంలో అంబర్ ప్యాకెట్ లభ్యం
దిశ, ఖమ్మం రూరల్: భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ మరోసారి అపవిత్రమైన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు బంధువులు, ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆదివారం లడ్డూను పంచేందుకు చూడగా అందులో అంబర్ ప్యాకెట్ దర్శనమిచ్చింది. దీంతో షాక్‌కు గురైన భక్తురాలు పద్మావతి విషయాన్ని ‘దిశ’కు తెలిపింది. అయితే, ఇటీవలే శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వును వాడినట్లుగా ల్యాబ్ రిపోర్ట్స్ వెలుగులోకి రావడంతో లడ్డూ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైందని భక్తులు మండిపడుతున్నారు. అసలు లడ్డూ ప్రసాదంలో అంబర్ ప్యాకెట్ ఏంటని శ్రీవారి భక్తుల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More : Disha effect : స్పందించిన ఏపీ సీఎం