- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల్లో నేను బరిలో ఉంటా : తుమ్మల నాగేశ్వరరావు
దిశ, ఖమ్మం : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడతానని, ఖమ్మం జిల్లా అభివృద్ధికి నా జీవితం అంకితం చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు జిల్లా సరిహద్దు లో భారీ గా స్వాగతం పలికారు. ర్యాలీ తో పాలేరు, కూసుమంచి, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం నగరంలో గొల్లగూడెం ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడ అభిమానుల మధ్య మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించారని కొందరు శునకానందం పొందుతున్నారన్నారు. కానీ తాను ఎవరినీ నిందించదల్చుకోలేదన్నారు.
నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉందని, ఖమ్మం జిల్లా అభివృద్ధికి తన జీవితం అంకితం చేశానని చెప్పారు. ఎందరో నాయకుల వల్లకానివి.. నేను ఖమ్మం జిల్లాలో అభివృద్ధి చేసి చూపించానన్నారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మీతో శభాష్ అనిపించుకుంటానన్నారు. రాజకీయ జీవితంలో ఎక్కడా తలవంచే ప్రసక్తే లేదన్నారు. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా వల్ల నన్ను నమ్ముకున్న వారు ఎవరూ తల దించుకోవద్దన్నారు. తనకు పదవి అలంకారం,
అహంకారం, అధిప్యతం కోసం కాదన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, జిల్లా ప్రజల కోసమే రాజకీయ జీవితం తప్పా.. తనకు పాలిటిక్స్ అవసరం లేదన్నారు. తాను ఖమ్మం జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా తెలుసు అన్నారు. ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తన కోసం అభిమానులు చూపించిన ప్రేమ ఎప్పటికి మరువను అని అన్నారు.
తుమ్మల మనసులో మాట కోసం అభిమానుల ఎదురు చూపు..
ఇటీవల 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కేసీఆర్, పాలేరు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను కూడా బరిలో ఉంటానని తాజాగా తుమ్మల ప్రకటించడంతో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో తుమ్మల అభిమానులు సంతోషం లో ఉన్నారు.
భారీగా ర్యాలీ..
ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి కాల్వవడ్డు మీదుగా మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ నుంచి అభిమానుల మధ్య కార్ల ర్యాలీ తో ప్రజలకు అభివాదం చేస్తుకుంటూ గొల్ల గూడెం చేరుకున్నారు. తుమ్మల ర్యాలీ లో చాలా మంది అభిమానులు వచ్చి తుమ్మల మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.