‘ఆరోగ్య మహిళ ’బృహత్తర కార్యక్రమం : ఎమ్మెల్యే రాములు నాయక్

by Sridhar Babu |
‘ఆరోగ్య మహిళ ’బృహత్తర కార్యక్రమం : ఎమ్మెల్యే రాములు నాయక్
X

దిశ, వైరా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ పథకం బృహత్తర కార్యక్రమమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కొనియాడారు. వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు అనేక రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు. ఉద్యోగ, వైద్య, పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల్లో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు.

ఆడబిడ్డల వివాహాలకు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఒక్కొక్కరికి రూ .100116 నగదును ఆర్థిక సహాయంగా అందజేస్తున్నారని వివరించారు. జన్మించిన ప్రతి ఆడపిల్లకు కేసీఆర్ కిట్టుతో సహా రూ.13000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ ఉంటారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎడిషనల్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ అనిత, మండల వైద్యాధికారులు ఉదయలక్ష్మి, బాలకృష్ణ , ఎస్ హెచ్ ఓ శాస్త్రి , మండల వైస్ ఎంపీపీ బాణాల లక్ష్మీనరసమ్మ, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, నాయకులు దారెల్లి కోటయ్య, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, కోఆప్షన్ సభ్యులు అప్పం సురేష్, నాయకులు మచ్ఛా వెంకటేశ్వరరావు (బుజ్జి ), పసుపులేటి మోహన్ రావు, లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ మడుపల్లి సైదా పాల్గొన్నారు.

Advertisement

Next Story