మణుగూరులో ‘జీవీ మాల్‌’ ప్రారంభం.. సందడి చేసిన యాక్టర్ అనసూయ

by Mahesh |   ( Updated:2024-10-07 08:34:29.0  )
మణుగూరులో ‘జీవీ మాల్‌’ ప్రారంభం.. సందడి చేసిన యాక్టర్ అనసూయ
X

దిశ, మణుగూరు: తెలుగు రాష్ట్రాల్లో అంచలంచలు ఎదుగుతున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘జీవీ మాల్‌’ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంకి వచ్చేసింది. సోమవారం షాపింగ్ మాల్ ప్రారంభానికి ‘జీవీ మాల్‌’ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం జీవీ మాల్ యాజమాన్యం, మండలంలోని పలు వ్యాపారస్థులు ఎమ్మెల్యే పాయంకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. పెద్ద పెద్ద సీటీలకే పరిమితమైన ‘జీవీ మాల్‌’ ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినందుకు, ఏజెన్సీ ప్రాంతాన్ని గుర్తించి ‘జీవీ మాల్‌’ ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మరో వారం రోజుల్లో దసరా పండుగ వస్తున్న సందర్భంగా మండల ప్రజలే కాక చుట్టూ ప్రక్కల ఉన్న ప్రజలు కూడా ఈ జీవీ మాల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

అనంతరం సినీ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ తన అందాలు ఆరబోసి ‘జీవీ మాల్‌’ ను ప్రారంభించారు. తర్వాత సినీ నటి అనసూయ అభిమానులతో సందడి చేసి పలు రకాల వస్త్రాల గురించి అభిమానులకు వివరించింది. తక్కువ ధరకే అందమైన చీరలు వస్తున్నాయని మహిళలకు తెలిపారు.ఆలస్యం చేయకుండా కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ చేయాలని తెలియజేశారు.అనంతరం ‘జీవీ మాల్‌’ ప్రారంభానికి, సినీ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయను చూడటానికి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోకి ‘జీవీ మాల్‌’ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని ప్రజలంటున్నారు. మండల సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాలతో, సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ ప్రారంభంలో వ్యాపారస్తులు దోసపాటి వెంకటేశ్వర్లు, పోశం సత్యనారాయణ, మండల అధ్యక్షుడు పీరాణాకి నవీన్, నాయకులు గాండ్ల సురేష్, గుడిపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed