గన్ మిస్ ఫైర్.. ఛాతిలో బుల్లెట్ దిగి డీఎస్పీ మృతి

by Disha Web Desk 9 |
గన్ మిస్ ఫైర్.. ఛాతిలో బుల్లెట్ దిగి డీఎస్పీ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భద్రాద్రి జిల్లాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చర్ల మండలం పూసుగుప్పలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో గన్ మిస్ ఫైర్ కావడంతో డీఎస్పీ శేషగిరి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో డీఎస్పీకి తీవ్రంగా గాయమవ్వడంతో సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో డీఎస్పీ శేషగిరి మృతి చెందారు. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న శేషగిరి ఆకస్మాత్తుగా మృతి చెందడంతో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed