- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టా భూమిలో ప్రభుత్వ భూమి బోర్డ్.. దస్త్రాలను మాయం చేస్తూ
దిశ,మణుగూరు : పట్టా భూమిలో ప్రభుత్వ భూమి బోర్డు ఏర్పాటు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అల్లంపల్లి అనే గ్రామంలో చోటుచేసుకుంది. పినపాక మండలం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌గా పని చేస్తున్న ఓ అధికారి అల్లంపల్లి అనే గ్రామంలో సర్వే నెం 80/P(X/15)గల ఒక ఎకరం పట్టా భూమిని ప్రభుత్వం భూమి అని చెప్పి బోర్డు ఏర్పాటు చేశారని ఆ భూమి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే 1980 కంటే ముందు ఉండాల్సిన భూరికార్డులు లేకుండా రెవెన్యూ అధికారులే మాయం చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజానికి 1950 నుంచి 1980 మధ్య భూరికార్డులో సర్వే నెం 80/P(X/15)గల పట్టా భూమి మీద నమోదైన భూమిని అట్టి భూరికార్డులను లేకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ భూమి కింద తెలుపుతూ ఆ పట్టా భూమిలో బోర్డు పెట్టడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. పినపాక ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక భూ రికార్డులను, దస్త్రాలను అధికారులే మాయం చేస్తున్నారని, అలాగే ఫేక్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.