- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Godavari : కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల..
దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి 55 అడుగులు మేర పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో మరో 24 గంటలు భద్రాద్రి ఏజెన్సీలో ప్రమాద ఘంటికలు అన్నట్లే. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, సోమవారం మధ్యాహ్నం 2. 04 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసి అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి సోమవారం రాత్రి 8 గంటలకు 49.70 అడుగులకు పెరిగింది. 12, 34, 930 క్యూసెక్కుల నీరు దిగువకు తరలివెళ్ళింది. ఏజెన్సీలోని రహదారులపైకి గోదావరి నీటితో పాటు వరద నీరు చేరుకోవడంతో, ఎవరు ఆదారి గుండా ప్రయాణించే వీలు లేకుండా పోలీసులు రహదారికి అడ్డంగా ట్రాక్టర్లు పెట్టారు.
గోదావరి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత పొంగి పొర్లడమే కాకుండా కాళేశ్వరం నుంచి కూడా భారీగా వరద నీరు తరలి వస్తుండటంతో మంగళవారం ఉదయానికి భద్రాద్రి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గింది. 25 గేట్లు ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ కు 14 వేల క్యూసెక్కుల నీరు తరలిరావడంతో 15 గేట్లు ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇప్పటికే ఏజెన్సీలోని పలు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి నది రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నందున ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలకు వెళ్లే రహదారి పైకి సబ్ స్టేషన్ వద్ద గోదావరి నీరు ప్రవహిస్తుండడంతో పర్ణశాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి 50 అడుగులు దాటితే ప్రధాన రహదారి పైకి గోదావరి ప్రవహించడం కారణంగా దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రవాణా స్తంభిస్తుంది.
ఫ్లడ్ షెల్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించని అధికారులు..
గోదావరికి వరదల సమయంలో ముంపు గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించడానికి అధికారులు పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా వాడుతారు. ప్రతి సంవత్సరం గోదావరి ప్రవాహం రెండవ ప్రమాద హెచ్చరిక దాటిన వెంటనే పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు సెలవు ప్రకటించి, ఆ కేంద్రాలలో ముంపు గ్రామాల ప్రజలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ లాంటి కార్యక్రమాలు చేపడతారు. కానీ భద్రాచలంలో గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి, మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి పెరుగుతున్నా... ఇంతవరకు పాఠశాలలకు సెలవు ప్రకటించలేదు. దీంతో అప్పటికప్పుడు ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలంటే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం... మంత్రి పొంగులేటి
భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుందని, 55 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని, ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఎంతటి విపత్కర పరిస్థితుల నైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో వచ్చిన వరదలు, చేపట్టిన సహాయ చర్యలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సోమవారం ఆయన భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతుని పరిశీలించారు.అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరదలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.