- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > మోడల్ స్కూల్లో కోతుల హల్చల్.. గాయపడిన విద్యార్థులు..
మోడల్ స్కూల్లో కోతుల హల్చల్.. గాయపడిన విద్యార్థులు..
X
దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్లో కోతుల బీభత్సంతో ఇద్దరి విద్యార్థినులకు గాయాలయ్యాయి. క్లాస్ నుండి మొదటి అంతస్తులో ఉన్న హాస్టల్ కు విద్యార్థినిలు వెళుతుండగా మెట్ల పై ఉన్న కోతులు ఒక్కసారిగా మీదకు రావడంతో భయాందోళనకు గురైన ఇద్దరు విద్యార్థినిలు అక్కడ నుంచి కిందకు దూకారు.
దీంతో ఇంటర్ సెకండియర్ చదువుతున్న చరిత, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు విధ్యార్ధునులను పెనుబల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినిలకు మోకాళ్లు, మోచేతులు, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయపడిన విద్యార్థినిల వెంట వార్డెన్ హాస్పిటల్ కు రాకుండా ఏఎన్ఎం ను వెంట పంపించించారు. బాధ్యతా రహితంగా వార్డెన్ ప్రవర్తించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story