- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వామి కార్యం.. స్వకార్యం..వినాయక పందిళ్ళే ప్రచార వేదికలు
దిశ, భద్రాచలం : వినాయక పందిళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రచార వేదికలుగా మారాయి. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావులు పట్టణంలోని వివిధ వినాయక మండపాలు వద్ద హడావుడి చేశారు. ఈ తొమ్మిది రోజులు అవకాశాన్ని వదులు కోకుండా వినాయక పందిళ్ళు సందర్శించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నానికి మొదటి రోజు శ్రీకారం చుట్టారు. స్వామి కార్యంతో పాటు, స్వకార్యం కూడా నెరవేరుతుండటంతో కమిటీలు ఆహ్వానించినా.. లేకపోయినా.. తమ అనుచరులు ద్వారా కమిటీలతో సంప్రదింపులు జరిపి వినాయక మండపాలు సందర్శించేందుకు పక్కాప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు తమ మండపాలకు వస్తే క్రేజ్ ఉంటుందని అభ్యర్థులు రాకను స్వాగతించడమే కాకుండా, అభ్యర్థులు వచ్చే సమయంలో భారీగా భక్తులు సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే పొదేం వీరయ్య మార్కెట్ లోని వినాయక మండపంతో పాటు పట్టణంలోని పలు పందిరిలను సందర్శించగా, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు అశోక్ నగర్ కాలనీలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహించారు.