- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Disha Effect : పర్యాటకుల పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి..
by Sumithra |

X
దిశ, పాల్వంచ : ఇటీవల కిన్నెరసానికి వచ్చిన పర్యాటకులపై ఎఫ్బీఓ కర్రతో దాడి చేయగా, సదరు అధికారి పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ నెల 17న కిన్నెరసానికి కొత్తగూడెం నుంచి ఇద్దరు పర్యాటకులు వచ్చారు. ఆ సమయంలో వైల్డఫ్ చెక్పోస్టులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవికుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ప్రవేశ టికెట్ విషయమై వారితో వాగ్వాదం నెలకొంది.
దీంతో రవికుమార్ పర్యాటకుల పై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటపై విచారణ జరిపి రవికుమార్ కు మెమో జారీ చేయడంతో పాటు ములకలపల్లికి బదిలీ చేశామని జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్ రెడ్డి కట్ట తెలిపారు. పర్యాటకుల పై ఎవరైనా ఫారెస్ట్ అధికారులు దాడి చేస్తే సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దిశ పత్రికకు వివరణ ఇచ్చారని తెలిపారు.
Next Story