- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరిపడా సాగునీరు అందించేందుకు కృషి : ఎమ్మెల్యే సండ్ర హామీ
దిశ, తల్లాడ / కల్లూరు : రైతులకు సరిపడా సాగునీరు అందించేందుకు అధికారులతో మాట్లాడతానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో సిరిపురం ఎన్ఎస్పీ కాల్వ పరిధిలోని 500 ఎకరాల పంట ఎండిపోయి బీటలు వారిన పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సాగునీరు రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యేకు రైతులు తెలిపారు.
దీంతో బిల్లుపాడు ఎంపీటీసీ రుద్రాక్ష బ్రాహ్మం ఆధ్వర్యంలో ఆయన పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులెవరు అధైర్య పడోద్దని, ఎన్ఎస్పీ ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, కేతినేని చలపతిరావు, ఇంజం కృష్ణార్జున రావు, మువ్వ మురళి, రైతులు పాల్గొన్నారు.
నిరంతరాయంగా సాగునీరు అందించాలి
రైతులు పంటలు కాపాడుకునే విధంగా వారబంది ఎత్తేసి నిరంతరాయంగా సాగునీరు అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల పరిధిలోని సాగర్ ఆయకట్టు పరిధిలోనీ సాగునీరు అందక ఎండిపోతున్న వరి పైరుని, రైతుల విజ్ఞప్తి మేరకు పలు గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరు జలవనరుల శాఖ కార్యాలయంలో ఈఈ లక్ష్మి నారాయణ తో ఆయన సమీక్షించారు. అక్కడే జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ డివిజన్ పరిధి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు సమన్వయం చేసుకొని నియోజకవర్గ పరిధిలోని సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో నీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరారు.
ప్రాజెక్ట్ ల్లో సాగునీరు పుష్కలంగా ఉన్నా అధికారుల సమన్వయ లోపంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇకపై అలా జరగకుండా చూడాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వారబంది ఎత్తేసి నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సంబంధిత శాఖ ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, డా. లక్కినేని రఘు, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు.