- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బైపాస్ రోడ్డుకు గురించి పట్టించుకోరా?
దిశ,కొత్తగూడెం రూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్ర పురానికి వెళ్లే బైపాస్ రోడ్డు అధ్వానంగా మారడంతో ఈ సమస్యను గత కొన్ని నెలలుగా ఎవరు పట్టించుకోకపోవడం పట్ల శేషగిరినగర్ గ్రామ పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి బుధవారం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ హేమచంద్ర పురం బైపాస్ రోడ్డుపై అధిక లోడుతో బొగ్గు లారీలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిపారు. దీనివల్ల రోడ్డు మొత్తం కంకర తేలి గుంటలు ఏర్పడడంతో శేషగిరి నగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదు సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు దుస్థితికి గురించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఎలాంటి పట్టింపు లేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడడం వల్ల రాత్రి సమయంలో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని తెలిపారు. భారీ వాహనాలు పోయినప్పుడు దుమ్ము ధూళి దారి పక్కన ఉన్న ఇండ్లపై పడటంతో పాటు జనం మీద సైతం వేద జల్లడం తో ఎలర్జీ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని పేర్కొన్నారు. హేమచంద్ర పురం బైపాస్ రోడ్డు సమస్య పరిష్కరించే వరకు దశలవారీగా పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులతో పాటు శేషగిరి నగర్ వాసులు పాల్గొన్నారు.
నిరసనతో నిలిచిపోయిన లారీలు...
హేమచంద్ర పురం బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ శేషగిరి నగర్ వాసులు రోడ్డుపై బైఠాయించి దాదాపు రెండు గంటల పాటు నిరసన తెలపడంతో ఇరువైపులా బొగ్గు లారీలు భారీగా నిలిచిపోవడం జరిగింది. లారీలు నిలిచిపోవడం వల్ల ద్విచక్ర వాహనాల దారులు ఆటో కారు డ్రైవర్లు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.