- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సమగ్ర కుటుంబ సర్వేపై పుకార్లను నమ్మొద్దు
దిశ, అన్నపురెడ్డిపల్లి : సమగ్ర కుటుంబ సర్వేపై పుకార్లను నమ్మొద్దని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో ప్రభుత్వం పొందుపరిచిన అంశాలను జాగ్రత్తగా పూర్తి చేయాలని, ఓపికగా ప్రజల నుంచి సమాచారం సేకరించి ఎవరికీ ఇబ్బంది లేకుండా సర్వే కొనసాగించాలని అధికారులకు సూచించారు.
సర్వే వల్ల నష్టం జరుగుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం అవగాహన లేని వాళ్లు ఈ విధంగా వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. సర్వేలో అధికారులు మీ నుంచి వివరాలను సేకరించేటప్పుడు కేవలం మీరు వెల్లడించిన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని, వేరే ఏ ఇతర విషయాలు మీ అనుమతి లేకుండా నమోదు చేయరని తెలిపారు. ఎన్యుమరేటర్లు సేకరించే సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, నియోజకవర్గ ప్రజలంతా గమనించి సర్వేకు సహకరించాలని కోరారు.