- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ : ప్రభుత్వ స్థలాలకు హద్దులు ఏర్పాటు .. వరుస కథనాలతో అధికారుల్లో చలనం
ఖమ్మం నగరంలో ఆక్రమించిన స్థలాలను గుర్తించి వాటి చిత్రాలతో సహా దిశ వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు మరింత జోరు పెంచారు. గత మూడు నాలుగు రోజులుగా ఖమ్మం నగరంలో ఆక్రమించిన స్థలాలను గుర్తించి వాటికి బౌండరీలు పాతే పనిలో ఉన్నారు. శనివారం గత ప్రభుత్వంలో ఆక్రమణకు పాల్పడిన నగర అధ్యక్షుడు 415 చదరపు గజాల స్థలంతో సహా రామాలయానికి అనుకుని ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలానికి కూడా అధికారులు హద్దులు పాతారు. అధికారుల చర్యలతో కొంతమంది ఆక్రమణదారులు నగరాన్ని విడిచి వెళ్లినట్లు సమాచారం. కాగా 58, 59 జీవోలను అదునుగా చేసుకుని గత ప్రభుత్వంలో ఉన్న వారు చేసిన ఆక్రమణలపై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దిశ, ఖమ్మం సిటీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూకబ్జాలపై చర్యలకు పూనుకుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రం ఎక్కడ భూకబ్జాలు జరిగిన వాటిని వెంటనే ప్రభుత్వ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ అధికారులు వాటిని గుర్తించే పనిలో పడ్డారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో కోట్ల విలువచేసే భూములను గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆక్రమణలు చేయడమే కాక ప్రభుత్వ జీఓలను అడ్డుపెట్టుకుని వాటిని స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రస్తుత ప్రభుత్వం ఆరా తీస్తుంది. అంతేకాక దిశ వరుస కథనాలతో ఖమ్మం నగరంలో ఆక్రమించిన స్థలాలను గుర్తించి వాటి చిత్రాలతో సహా ప్రచురించడంతో అధికారులు మరింతగా జోరు పెంచారు. దీనిలో భాగంగానే గత మూడు నాలుగు రోజులుగా ఖమ్మం నగరంలో ఆక్రమించిన స్థలాలను గుర్తించి వాటికి బౌండరీలు పాతే పనిలో పడ్డారు.
నిన్న గత ప్రభుత్వంలో ఆక్రమణకు పాల్పడ్డ నగర అధ్యక్షుడు 415 చదరపు గజాల స్థలంతో సహా రామాలయానికి అనుకుని ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలానికి కూడా అధికారులు బౌండరీలు పాతారు. అంతేకాక ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో కొంతమంది ఆక్రమణదారులు నగరాన్ని విడిచి వెళ్లినట్లు సమాచారం. 58, 59 జీవోలను అదునుగా చేసుకొని నాటి ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు చేసిన అక్రమాలపై సైతం ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి వారిపై కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఇండ్లు లేని పేద ప్రజలకు వాటిని అందించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తుంది.
విలువ గల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ మంత్రులు తెలపడంతో అధికారులు మనోధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం నగరంలో ఎన్ఎస్పీ, ఎఫ్‌టీఎల్, గ్రామకంఠం, ప్రభుత్వ భూములు నాటి ప్రభుత్వంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, విలేకరులతో సహా ఎవరైనా సరే ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు. ఖమ్మం నగరంలో ఆక్రమణలకు పాల్పడిన భూముల సర్వే నెంబర్లతో సహా దిశ వరుస కథనాలు ప్రచురించడమే కాక వాటి ఫొటోలను సైతం ప్రచురించడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది.