- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీల అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
దిశ, ఖమ్మం రూరల్ : పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పాలేరు శాసనసభ సభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవల పెద్దతండా అభివృద్ధికి కేటాయించిన రూ.10 కోట్లకు ప్రతిపాదన పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ మండలంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి రూ. 10లక్షల నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఏదులాపురం, నేలకొండపల్లి పంచాయతీలకు పదికోట్ల చొప్పున నిధులు విడుదలైనట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హమీ మేరకు నిధులు విడుదలైనట్లు చెప్పారు.
పెద్దతండా, ఏదులాపురం పంచాయతీల్లో నూతనంగా ఏర్పడిన కాలనీలకు సీసీ రోడ్ల, డ్రైనేజీల నిర్మాణానికి అధికారులు అంచనాలు తయారు చేయాలన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పని ఏదైనా నేరుగా తనను వచ్చి కలవచ్చునని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, ఎంపీడీవో ఆశోక్‌కుమార్, ఎంపీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రామక్రిష్ణ, టీఆర్ఎస్ నాయకులు మోహన్, క్రిష్ణారావు, మానుకోండ శ్రీను, రెడ్యానాయక్, ఉదయ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.