రోజు రోజుకు పోలీస్ శాఖలో పెరుగుతున్న ఉదంతాలు.. మరో కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి

by Anjali |
రోజు రోజుకు పోలీస్ శాఖలో పెరుగుతున్న ఉదంతాలు.. మరో కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు పోలీస్ శాఖలో ఉదంతాలు పెరుగిపోతున్నాయి. కోర్టు విషయంలో వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ ఓ కానిస్టేబుల్ దగ్గర చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్, ఆయన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు, కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ లోంగదిసుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా.. తన భార్యతో, కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇంతకు ముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్‌లో దొరికాయి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు. 10 ఏండ్ల ప్రేమ, ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed