కరకట్ట నిర్మాణం పూర్తి చేయండి

by Disha Web Desk 15 |
కరకట్ట నిర్మాణం పూర్తి చేయండి
X

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలోకి ప్రతి ఏడాది వర్షాకాలం గోదావరి వరద పొంగి ప్రవహించడం వల్ల కాలనీ మొత్తం ముంపునకు గురై కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు మంత్రులకు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కాగా శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కాలనీ వాసుల ఓట్ల కోసం హడావుడిగా 40 కోట్ల వ్యయంతో కరకట్ట పొడిగింపు ప్రణాళిక సిద్ధం చేసి ఆ కాలనీవాసులను ముంపు నుండి బయటపడేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఎన్నికల కోడ్ వచ్చే రోజే అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చే హడావుడిగా శంకుస్థాపన కూడా చేయించారు. కానీ పనుల విషయంలో జాప్యం జరుగుతుంది. ఈ ప్రాంతం

పైన, భద్రాచలం పైన పూర్తి అవగాహన ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంతో పాటు కరకట్ట నిర్మాణం సైతం పూర్తిచేసి సకాలంలో సుభాష్ నగర్ ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ సైతం పూర్తి చేయించారు. అయితే పాలనాపరమైన అనుమతులు లభించినప్పటికీ కరకట్ట నిర్మాణ పనులలో తీవ్ర జాప్యం జరుగుతుంది. కరకట్ట నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నిర్మాణంలో అలసత్వం చూపిస్తున్నారు. దీంతో సుభాష్ నగర్ కాలనీవాసులు అందరూ కరకట్ట నిర్మాణ జాప్యం గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి శనివారం నాడు మరోసారి తీసుకుని వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తో మాట్లాడుతూ సుభాష్ నగర్ ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించి వర్షాకాలం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



Next Story

Most Viewed