ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త..కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా చేసి హత్య.

by Dishafeatures1 |
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త..కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా చేసి హత్య.
X

దిశ, సినిమా: ఎవరైనా సరే ఇండస్ట్రీలో అడుగుపెట్టాక స్టార్ గుర్తింపు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటారు. కానీ ఈ నటికి మంచి గుర్తింపు రావడమే శాపం అయింది. హాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నటువంటి నటి షారన్ టేట్ 26 సంవత్సరాల వయసులో దారుణంగా హత్యకు గురయింది.

ఆమె మాత్రమే కాదు ఆమెకు పుట్టబోయే బిడ్డ, ఆమె ముగ్గురు స్నేహితులు సహా ఒక అపరిచితుడు హత్యకు గురయ్యారు. గోల్డెన్ గ్లోబ్-నామినేట్ అయిన నటి షారన్ టేట్ ‘వ్యాలీ ఆఫ్ ది డాల్స్’లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దర్శకుడు రోమన్ పోలాన్స్కి భార్య కూడా. ఆగస్ట్ 9, 1969న, లాస్ ఏంజిల్స్‌లోని బెనెడిక్ట్ కాన్యన్‌లో టేట్ ఎనిమిదిన్నర నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

ఈ హత్యలను ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రంలో చూపించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌ చార్లెస్ మాన్సన్ అండ్ కుటుంబ సభ్యులే షారోన్ కడుపుతో ఉందని కూడా చూడకుండా 51 సార్లు కత్తితో పొడిచి చంపారు అని తర్వాత తేలింది. అయితే ఈ హత్యకు కారణం ఈర్ష్య మాత్రమే! హాలీవుడ్‌ ప్రపంచంలో ఈమె ఎదుగుదలను తట్టుకోలేకనే హత్య చేశారు. హిస్టరీలో ఇలాంటి సంఘటనలు విన్న ప్రతిసారీ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తాయి. కలవర పెడతాయి. కలిచివేస్తాయి కదా.. అయితే ఈ హత్య ఉదంతం ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed