BREAKING: టీఎస్ ఈ‌సెట్ (TS ECET) ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఆ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండిలా..

by Shiva |   ( Updated:2024-05-20 07:20:27.0  )
BREAKING: టీఎస్ ఈ‌సెట్ (TS ECET) ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఆ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండిలా..
X

దిశ, వెబ్‌డెస్క్: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీ ఫార్మసీ సెంకడియర్ ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS ECET)-2024 ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. అయితే, మే 6న మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్‌ పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థినీ విద్యార్థులు https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు.

ఫలతాల కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి:

https://ecet.tsche.ac.in/


Advertisement

Next Story

Most Viewed