- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుమ్మల, పొంగులేటి పై సీఎం కేసీఆర్ సెటైర్లు
దిశ, వైరా : రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కపై కూడా సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇక్కడ మాజీ మంత్రి ఒకరు బాగా నరుకుతుండు కదా అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వననటానికి వాడెవడండీ అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అంతటితో ఆగని కేసీఆర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కును వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అందుకు వైరాలో మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికయింది.
ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గోదావరి నది పారుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ లాంటి ప్రాజెక్టు నిర్మించాలని గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి ఇక్కడ బాగా నరుతుండు కదా, ఆయన కూడా సీతారామ లాంటి ప్రాజెక్టు గురించి ఎందుకు ఆలోచించ లేదంటూ తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి అన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పారని, ఆయనను చిత్తుచిత్తుగా ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ఇక్కడ కొంతమంది అహంకారంతో మాట్లాడుతున్నారని పొంగులేటిని ఉద్దేశించి పరోక్షంగా కేసీఆర్ విమర్శించారు. వారి నోట్ల కట్టలు హైదరాబాదులో దొరుకుతున్నాయని ఆరోపించారు. డబ్బు అహంకారంతో వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గడప తొక్కనివ్వకపోవడానికి వీడెవడండీ.....
నాకు అర్థం కావట్లేదని అన్నారు. అసెంబ్లీకి ఎవరిని పంపాలో నిర్ణయించేది మీరు కదా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీకి పంపే ఆ ఓటు మీ వద్ద ఉంది కదా అంటూ బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువైన మీ ఓటును బీఆర్ఎస్ కు గుద్ది బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, బీఆర్ఎస్ నాయకుడు సంబాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.