పేదప్రజల కోసమే అనేక సంక్షేమ పథకాలు..

by Sumithra |   ( Updated:2023-11-13 14:27:22.0  )
పేదప్రజల కోసమే అనేక సంక్షేమ పథకాలు..
X

దిశ, మణుగూరు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్షమని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం భూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీపురం ఐటీసీలో యార్డ్ ప్రాంగణంలో హెలిప్యాడ్‌ దిగారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని సభసాక్షిగా తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ వల్లే సుభిక్షంగా ఉందని తెలియజేశారు. రాష్ట్రం సాదించుకున్నప్పటి నుంచి రోడ్లు, త్రాగు నీరు, కరెంట్ కే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పేద ప్రజల ప్రతి ఇంటికి మిషిన్ భగీరథ ద్వారా తాగునీరు ఇచ్చామన్నారు.

రైతు, రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని రైతుల కోసం వ్యవసాయ స్తిరకరణ చేశామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి పంట మూడింతలు దిగుబడి ఇవ్వాలని రాష్ట్రం పాటుపడిందన్నారు. రైతుల కోసం పెట్టిన పథకమే రైతుబంధు అన్నారు. రైతు బంధు, ధరణి ద్వారా ఎన్నో రైతు కుటుంబాలు అభివృద్ధి చెందాయన్నారు. రైతు కంటతడి పెట్టకూడదనే ఉద్దేశంతోనే రైతు బంధు పధకం, ధరణి, ఉచిత కరెంట్ లాంటివి ప్రవేశ పెట్టమన్నారు. రైతులను రాష్ట్రం అన్ని విధాలా ఆదుకుందని సభ సాక్షిగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులను అభివృద్ధి చెందనివ్వకుండా చేస్తుందని, రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పధకం, ధరణి, ఉచిత కరెంట్ లాంటివి తీసివేస్తుందని సభ ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండకుండా చేయాలన్నదే కాంగ్రెస్ లక్షమన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, సీఎం సహాయనిధి, పింఛన్లు, దళిత బంధు, గిరిజన బంధు, పోడు భూములకు పట్టాలు తదితర వన్ని ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. పేదలకు ఇచ్చిన పధకాల వల్లే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ప్రజలే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ది చెప్పుతారని వ్యాఖ్యానించారు.

పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధి నాయకుడు..

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంచి అభివృద్ధి నాయకుడని కేసీఆర్ సభాపూర్వకంగా తెలిపారు. నిత్యం పినపాక అభివృద్ధి కోసం తనతో కొట్లాడే నాయకుడని ప్రజలకు గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతం అయిన పినపాకను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నదే రేగా లక్షమన్నారు. రేగా అడిగినప్పడల్లా నిధులు మంజూరు చేసేవాడిని చెప్పారు. ఒకప్పుడు చూస్తున్న పినపాక వేరు.. ఇప్పుడు చూస్తున్న పినపాక వేరు అని ఈనాడు పినపాక అభివృద్ధి చెండానికి కారణం రేగా కాంతారావు అని కొనియాడారు. బీటీపీఎస్ నిర్మాణ విషయంలో ఎంతో శ్రమించాడని గుర్తు చేశారు. బీటీపీఎస్ నిర్మాణం వందల మందికి ఉద్ద్యోగాలు వచ్చాయంటే కేవలం రేగానే కారణమన్నారు.

ప్రగతి భవన్ వచ్చాడంటే సార్.. మాపినపాకకు అది కావలి, ఇది కావాలని పని అయిపోయేంతవరకు అక్కడే ఉండేవాడిని చెప్పారు. రేగాలాంటి నాయకుడు పినపాకకు దొరకడం పినపాక ప్రజల అదృష్టం అన్నారు. ఈ ఎన్నికల్లో రేగా కాంతారావుని అధిక మెజారితో గెలిపించాలని పినపాక ప్రజలను కోరారు. అలాగే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం వెంకట్రావ్ ని ప్రకటించామని వెంకట్రావ్ ను కూడా భద్రాచలం ప్రజలు అత్యధిక మెజారితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పినపాక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Read More..

అందోల్‌లో 22 నామినేషన్లకు ఆమోదం...

Advertisement

Next Story

Most Viewed