- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలి
దిశ,టేకులపల్లి : స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. వి. పాటిల్ కోరారు. టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామంలో సమగ్ర ఇంటింటి సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సర్వేలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే చేస్తున్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు పక్కాగా నమోదు చేసుకోవాలని, అలాగే సర్వే అయిన ప్రతి ఇంటి గోడ పైన ఖచ్చితంగా స్టిక్కర్ అంటించాలని సూచించారు. పత్రంలో ఉన్న ప్రశ్నలను సరిగ్గా నింపుతున్నారా లేదా అని ఫామ్ ను తీసుకొని కలెక్టర్ పరిశీలించారు.
ప్రతి ఇంటిలోని సభ్యులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఓపికతో ప్రతి కుటుంబం నుండి స్పష్టత కలిగిన సమాధానాలను సేకరించాలని, సర్వే జరుగుతున్న సమయంలో కుటుంబ యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని అర్థం అయ్యే విధంగా తెలియజేయాలని సూచించారు. నింపిన షెడ్యూల్ ఫారం జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. ఫోన్ ద్వారా సమగ్ర సర్వేను నిర్వహించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నాగ భవాని, ఎంపీడీఓ రవీందర్ రావు, ఎంఈఓ గణేష్ గాంధీ, ఏపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.