దసరాను మాతో జరుపుకోండి : భద్రాద్రి కలెక్టర్

by Aamani |   ( Updated:2024-10-10 12:58:53.0  )
దసరాను మాతో జరుపుకోండి : భద్రాద్రి కలెక్టర్
X

దిశ, అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని పామాయిల్ రైతులు దసరా పండుగను అశ్వారావుపేటలో జరుపుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీ విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఈనెల 12న నూతన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఆ ఫ్యాక్టరీని సందర్శించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి.. ప్రోగ్రాం షెడ్యూల్ ను ఆయిల్ ఫెడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమం నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితీష్ వి పాటిల్ మాట్లాడుతూ.. దసరా పండుగ రోజును పామాయిల్ రైతులందరూ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన రైతుల కోసం ఆయిల్ ఫిట్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నూతన పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. భవిష్యత్తులో పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కార్యక్రమ ఏర్పాట్లు పై కలెక్టర్ చర్చించారు.

Advertisement

Next Story