ఈ గడ్డ బిడ్డను ఆశీర్వదించండి : తాండ్ర వినోద రావు

by Disha Web Desk 11 |
ఈ గడ్డ బిడ్డను ఆశీర్వదించండి :  తాండ్ర వినోద రావు
X

దిశ,సత్తుపల్లి : ఈ గడ్డబిడ్డగా ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించండి అని బిజెపి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి సత్తుపల్లి స్థానిక మాధురి ఫంక్షన్ హాల్ నుంచి టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ పార్టీ నాయకుల మద్దతుతో కలిసి స్థానిక రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో తాండ్ర వినోద రావు మాట్లాడుతూ… గత పాలకులు తప్పిదాల వల్ల ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధి జరగలేదని ప్రస్తుత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీని గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవితో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

గత పాలకుల పొరపాటులతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందక ఖమ్మం అభివృద్ధి కుంటుపడిందని ఖమ్మం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల కోసం సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు సింగరేణి నిధులు ఎక్కువ భాగం కేటాయించి ఈ ప్రాంత ప్రజలకు మంచినీటి వసతులతో పాటు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని అన్నారు. కేంద్ర నిధుల ఈ ప్రాంతంలో నిరుపేదలకు పక్కాగృహాలు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మళ్లీ కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రాబోతుందని ఖమ్మం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవితో పాటు ఖమ్మం జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

మీలో ఒకడిగా మీ ప్రాంత బిడ్డగా మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ప్రయోజనాల కోసం టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

టిడిపి పార్టీ కాంగ్రెస్ తో కలియక ఎన్టీ రామారావు ఆత్మ శోభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, బిజెపి నాయకులు నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా, ఆ చంటి నాగ స్వామి, జనసేన నాయకులు శరత్, టిడిపి నాయకులు పోట్రు రామారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు కార్యకర్తలు, స్థానిక మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed