- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Bhatti Vikramarka : పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి శ్రీకారం
దిశ, మధిర : మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క శనివారం ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో 4 కోట్ల 65 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రహదారులకు శంకుస్థాపన చేశారు. కమలాపురం ఎస్సీ కాలనీ నుంచి పమ్మి వరకు రూ. 2 కోట్ల 40 లక్షలు, కమలాపురం నుంచి జిల్లేడుగడ్డ వరకు రూ. 2 కోట్ల 25 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, కమలాపురం గ్రామంలో రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు, కమలాపురం నుంచి
అయ్యగారిపల్లి వరకు రూ. 2 కోట్లు, కమలాపురం నుంచి అమ్మపేట వెలిగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. మల్లన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 132/33 కేవీ సబ్ స్టేషన్ ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముదిగొండ మండలం, కమలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో ఉప ముఖ్యమంత్రిని సత్కరించారు. బాణాసంచా పేలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ భట్టి విక్రమార్కపై తమ అభిమానాన్ని చాటుకుంటూ, దారి పొడుగునా ఆయన వెంట గ్రామస్తులు బారులు తీరి నడిచారు.