- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి
దిశ, భద్రాచలం : ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తో కలిసి ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వైద్యం చేయించుకోవడానికి ఆదివాసీ గిరిజనులు వస్తుంటారని, వారికి సరైన వైద్య సేవలు అందించి సరిపడా మందులు ఇచ్చి పంపించాలని అన్నారు.
ఆస్పత్రి పరిసరాలు, వార్డుల్లో పరిశుభ్రతను పాటించాలని, డాక్టర్లు సమయపాలన పాటించి రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్య సేవలు అందించాలని, సిబ్బంది కూడా రోగులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం ఏఆర్టీ సెంటర్, పిల్లల సంరక్షణ కేంద్రం, ల్యాబ్, లేబర్ రూమ్స్, మార్చురీ గది, ఆయుర్వేద వైద్యశాల సందర్శించి రోగుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ ఎం ఓ డాక్టర్ సంతోష్, డాక్టర్ విజయరావు, డాక్టర్ శ్రీనిధి, డాక్టర్ ప్రమీలరాణి తదితరులు పాల్గొన్నారు.