- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్షక భటుడు హల్‌చల్..ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద వార్డెన్ పై దాడి
దిశ, కొత్తగూడెం రూరల్: లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని శ్రీ రామచంద్ర ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఆవరణలో గల ఒక హాల్లో ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. ఈ ఈవీఎంల గోదాముకు రక్షణగా ఉండే కానిస్టేబుల్ మద్యం మత్తులో గురువారం హల్చల్ చేయడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఈవీఎం గోదాము పక్కనే ఉన్న ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఉండే వార్డెన్ అన్వర్ పై కానిస్టేబుల్ బెల్టుతో దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనపై విద్యార్థులు ప్రశ్నిస్తుండగా వారిపై కూడా దురుసుగా వ్యవహరించి విరుచుకుపడ్డాడు. ఈ సంఘటన పట్ల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న సమయంలో సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దీంతో భయాందోళన పరిస్థితి సద్దుమణిగింది. దాడికి దిగి విద్యార్థులపై దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై బాధితుడు అన్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కానిస్టేబుల్ తో ఇబ్బందిగా ఉంది....
ఈవీఎంల స్ట్రాంగ్ రూము వద్ద భద్రత విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ వల్ల తనకు తమ హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని వార్డెన్ అన్వర్ ఆవేదన వ్యక్తం చేశాడు. హాస్టల్ పక్కనే ఈవీఎం గోదాము ఉండడం వల్ల అసౌకర్యంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా కానిస్టేబుల్ తో తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. అసౌకర్య సమస్యను అధికారులు పరిష్కరించాలని వార్డెన్ తో పాటు విద్యార్థులు వేడుకుంటున్నారు.