- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతకక్షలతో యువకుడిపై దాడి
దిశ, వైరా : మండలంలోని రెబ్బవరం గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ యూత్ మాజీ అధ్యక్షుడు చల్లా సతీష్ పై దాడి జరిగింది. ఈ దాడిలో సతీష్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి తండ్రి చల్లా వెంకటేశ్వర్లు సోమవారం వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. వైరా పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న రెబ్బవరంనకు చెందిన కానిస్టేబుల్ బండారు హరీష్, అతని బంధువులు శ్రీను, మక్కల శివానీ, పల్లపు శేషమ్మ, గణేష్, దేవళ్ల సురేష్ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు.
సతీష్ తన మిత్రుడు బత్తుల నాగబాబుతో కలిసి ద్విచక్రవాహనంపై కొండకొడిమ వైపు వెళ్తుండగా బత్తుల రామకృష్ణ మామిడితోట దగ్గర వారు కాపు కాసి దాడికి పాల్పడ్డారని, మారణాయుధాలతో తన కుమారుడిపై హత్యాయత్నం చేశారని, నాగబాబును కూడా కొట్టారని వెంకటేశ్వర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్రగాయాలైన సతీష్ ను చికిత్స కోసం వైరా ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గతంలో హరీష్ కుటుంబంతో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వైరా ఎస్ఐ శాఖమూరి వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.