- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్ 19 లోపు వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలి
దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన పని చేయడానికి అర్హత గల వారు అక్టోబర్ 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 అసిస్టెంట్ ప్రొఫెసర్ లు (రేడియో డయాగ్నోసిస్, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్), ఐసీయూ సేవలు అందించగల 5 సీఏఎస్ స్పెషలిస్ట్ (అనస్థిషియా, 2 జనరల్ మెడిసిన్, 2 పల్మనరీ మెడిసిన్) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నిర్ణయించామని అన్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 19 సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 21న ఇంటర్వ్యూ ద్వారా పోస్టులలో నియమించడం జరుగుతుందని, విద్యార్హతలు, నియమ నిబంధనలు ఖమ్మం జిల్లా వెబ్ సైట్ https://khammam.telangana.gov.in లేదా ప్రభుత్వ వైద్య కళాశాల వెబ్సైట్ https://gmckhammam.org నందు సంప్రదించాలని ప్రిన్సిపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.