- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయ, విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలి
దిశ, భద్రాచలం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా, ఉపాధ్యాయ విధానాలను వ్యతిరేకించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక నన్నపనేని మోహన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేయాలని, జూలై 1 నుండి ఐ ఆర్ మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ పునరిద్దరించాలని, ఎన్ ఈ పీ 2020 రద్దుచేయాలని, విద్యారంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై 18,19న మండల స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని,
ఆగస్టు 12 న జిల్లా కేంద్రాలలో ధర్నా చేశామని, మూడవ దశలో సెప్టెంబర్ 1 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను సమాయత్తం చేయడానికి ఐదు కమిటీలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయని తెలిపారు. పీఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఇంతవరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహా ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీ పీటీ ఎఫ్ రాష్ట్ర నాయకులు మునిగడప రామాచారి, యూ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కిషోర్, బీ టీ ఎఫ్ రాష్ట్ర నాయకులు వేణు, టీ పీ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజు, యూ టీ ఎఫ్ నాయకులు మురళి మొహన్, ఎస్ టీ ఎఫ్ జిల్లా నాయకులు పాపారావు, ఏ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు జయబాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.