అంబులెన్స్ లో రూ. 2 కోట్ల విలువ చేసే గంజాయి తరలింపు

by Kalyani |   ( Updated:2024-09-15 16:35:23.0  )
అంబులెన్స్ లో రూ. 2 కోట్ల విలువ చేసే  గంజాయి తరలింపు
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో శనివారం అర్ధ రాత్రి 12 గంటలకు రోగులను తరలించాల్సిన అంబులెన్స్ లో సుమారు రెండు కోట్ల రూపాయల గంజాయి పట్టుబడింది. రామవరం సింగరేణి సివిల్ విభాగం కార్యాలయం వద్ద తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ అంబులెన్స్ పంక్చర్ కావడంతో ఆగిపోయింది. స్థానికులు ముగ్గురు పంక్చర్ వేసేందుకు వాహన సిబ్బందికి సహకరించారు. ఈ క్రమంలో వాహనంలో గంజాయి పొట్లాలు ఉన్నట్లు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రెండో టౌన్ సిఐ.ఐ. ఎన్. రమేశ్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనం లోపల భారీ ఎత్తున గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. వాహనాన్ని, గంజాయి తీసుకెళ్తున్న ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. పట్టుకున్న గంజాయి సుమారు 2.5 నుంచి 3 క్వింటాళ్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా పోలీసులు పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed