retirement : పదవీ విరమణ తర్వాత శేషజీవితం ఆయురారోగ్యాలతో గడపాలి

by Sridhar Babu |
retirement : పదవీ విరమణ తర్వాత శేషజీవితం ఆయురారోగ్యాలతో గడపాలి
X

దిశ, ఖమ్మం : ప్రతి ఉద్యోగి పదవీ విరమణ సమాజమే అని, పదవి విరమణ పొందిన వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఎన్పీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ సురేందర్ అన్నారు. బుధవారం ఎన్పీడీసీఎల్ ఖమ్మం డివిజన్ పరిధిలోని జేఏవో గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన తక్కెళ్లపల్లి శేషగిరిరావును ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ సురేందర్ మాట్లాడుతూ... ఎన్పీడీసీఎల్ సంస్థ లో 33 సంవత్సరాలు కార్మికుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. కార్మికుల సంక్షేమం, సంస్థ సంక్షేమం కోసం అనేక పనులు చేశారని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా నేతలు శేషగిరిరావు ను ఘనంగా సన్మానించారు.

Advertisement

Next Story