- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పనిచేయని అధికారులపై చర్యలు తప్పవు
దిశ, నేలకొండపల్లి : పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని,ఈ సంవత్సరం కనీవిని ఎరుగని రీతిలో వరి ధాన్యం పండిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆరెగూడెం, పైనంపల్లి గ్రామాల్లో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లి, బోదుల బండ గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లి తహసీసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పనిచేయని అధికారులకు తగు శిక్ష తప్పదని అన్నారు. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండిందన్నారు. సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తూ రైతులను ఆదుకుంటామని చెపుతున్నారని, పదేళ్ల వారి పరిపాలనలో ఏం చేశారో చూశామన్నారు. ఈసారి 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్టు తెలిపారు. పత్తి పండించిన రైతులకు కూడా సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు.
విద్యార్థులతో కలిసి భోజనం
నేలకొండపల్లి మండలం అనంతనగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో పదవ తరగతి క్లాసులో విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, మంచిగా చదువుకొని ఉన్నత స్థానంకు ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భోజనం ఎలా పెడుతున్నారు, మెనూ అమలు చేస్తున్నా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలో పరిస్థితిని పరిశీలించారు. గురుకులాల్లో చదువుకునే వారికి ఎలాంటి లోటూ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొడాలి గోవింద్, వెన్నుపూసల సీతారాములు, వల్లాల రాధాకృష్ణ, శాఖమూరి రమేష్, కడియాల నరేష్, బోయిన వేణు, నంబూరు నరేష్, బచ్చలకూరి నాగరాజు, అంజని, నాయకులు పాల్గొన్నారు.