Accenture IT Company : సాయిస్ఫూర్తిలో యాక్సెంచర్ ఐటీ కంపెనీ రిక్రూట్మెంట్..

by Sumithra |
Accenture IT Company : సాయిస్ఫూర్తిలో యాక్సెంచర్ ఐటీ కంపెనీ రిక్రూట్మెంట్..
X

దిశ, సత్తుపల్లి : స్థానిక సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో యాక్సెంచర్ అమెరికన్ బహుళజాతి వృత్తిపరమైన సేవల సంస్థ చెన్నై వారిచే ఆఫ్ లైన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ కు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న అన్నిబ్రాంచ్ ల విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలకు మొత్తం 42 మంది విద్యార్థులు హాజరయ్యారని కంపెనీ నుండి ప్రతినిధులు తెలిపారు.

తుది జాబితాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (సీఎస్ యం) నుండి 01) పులగం.లక్ష్మిప్రసన్న, 02)కిష్టం.మానస అర్హత సాధించి AI ఇంజనీర్, ఎంబెడెడ్ సిస్టం డిజైన్ ఇంజనీర్ కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. విద్యార్థులు బీటెక్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవుతారని, కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. వూటుకూరి శేషారత్నకుమారి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి. పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద రెడ్డి, కళాశాల సెక్రెటరీ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి, కళాశాల వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థినిలకు అభినందనలు తెలిపారు.



Next Story