- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏదులాపురంలో పీహెచ్సీని ఏర్పాటు చేయాలి
దిశ, ఖమ్మం రూరల్ : ఏదులాపురంలో పీహెచ్సీని ఏర్పాటు చేయాలని మంత్రి తన్నీరు హరీష్ కు సీపీఐ నేతలు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఖమ్మం రూరల్ మండలం సీపీఐ నేతలు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఖమ్మం రూరల్ మండలంలో
90 వేలకు పైగా జనాభా కలిగి ఉన్నారని, ఉన్న ఒక్క పీహెచ్సీలో వైద్య సేవలు అందించలేకపోతున్నారని తెలిపారు. కావున ఏదులాపురం కేంద్రంగా మరొక పీహెచ్సీ, అదనపు సబ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా వినతిలో పేర్కొన్నారు. అదేవిధంగా పెద్ద తండా, ఏదులాపురం, పోలేపల్లి ,వెంకటగిరి, గుర్రాలపాడు, గ్రామపంచాయతీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, జనాభాకు అనుగుణంగా అదనపు సబ్ సెంటర్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, మండల సమితి సభ్యులు వెంపటి సురేందర్ పాల్గొన్నారు.