సమన్వయంతో ఉజ్వల భవిష్యత్

by Sridhar Babu |
సమన్వయంతో ఉజ్వల భవిష్యత్
X

దిశ బ్యూరో, ఖమ్మం : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ఆయన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పేరెంట్స్​, టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని, పాఠశాలలో జరుగుతున్న అంశాలను ఉపాధ్యాయులు రెగ్యులర్ గా, వాట్సాప్ లేదా డైరీ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కోరారు.

పాఠశాలలో ఏమి నేర్చుకుంటున్నారో ప్రతి రోజూ ఇంటి వద్ద తల్లిదండ్రులు పరిశీలించాలని, ప్రతిరోజూ కొంత సమయం ఇంటి వద్ద పిల్లలు చదివే విధంగా చూడాలని కోరారు. పాఠశాలలో నిర్వహించే పేరెంట్, టీచర్స్ మీటింగ్ లకు తల్లిదండ్రులు రెగ్యులర్ గా హాజరుకావాలని, ప్రతి సబ్జెక్టులో తమ పిల్లల పురోగతి వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులను రెగ్యులర్ గా పాఠశాలకు పంపాలని కోరారు. అనంతరం ఆయన పాఠశాలలోని టాయిలెట్స్, వంటగది , ఆర్ఓ ప్లాంట్ గది, కిచెన్, గార్డెన్లను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ మరమ్మతు పనులు పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకొని రావాలని ఆదేశించారు.

Next Story

Most Viewed