ఆడుకుంటూ అనంతలోకాలకు..

by Sumithra |   ( Updated:2023-04-17 17:33:28.0  )
ఆడుకుంటూ అనంతలోకాలకు..
X

దిశ, తిరుమలాయపాలెం : తోటి పిల్లలతో ఆడుకుంటూ మూడు సవంత్సరాల బాబు అకస్మాత్తుగా మరణించిన సంఘటన సోమవారం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన గౌరబోయిన శంకర్-కవిత దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక పాప.

రెండో కుమారుడు జై (3) ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జై ముక్కులోనుంచి నలుపు రంగు నీరు రావడం గమనించిన తల్లిదండ్రులు, గ్రామీణ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాబు గుండెపోటుకు గురై మృతిచెందినట్టు తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా విలపించారు.

Advertisement

Next Story

Most Viewed