Khammam: చేపల పులుసు తినాలనే కోరిక తెచ్చిన తంటా! ఖమ్మం జిల్లాలో విచిత్ర ఘటన

by Ramesh N |   ( Updated:2024-12-01 06:29:35.0  )
Khammam: చేపల పులుసు తినాలనే కోరిక తెచ్చిన తంటా! ఖమ్మం జిల్లాలో విచిత్ర ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివారం ఆనందంగా చేపల పులుసు తినాలనే కోరికతో (Fishing) వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. (Khammam) ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిపురం టోల్గేట్ సమీపంలో రాజు అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి అక్కడ ఉన్న మోరీలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు.

వెంటనే కేకలు వేయడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి తక్షణమే జేసీపీ (JCB) సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కొద్ది సేపు శ్రమించిన తర్వాత అతన్ని సురక్షితంగా వెలికితీశారు. బయటకు వచ్చిన రాజు బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కాగా, ఘటనకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట (Viral News) చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed