- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Phone Tapping కేసులో కీలక పరిణామం.. నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు..
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు.. నిన్న (సోమవారం) నాడు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నారు. తెలంగాణ సర్కార్ అమృత్-2 టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్‌కు కంప్లైంట్ చేస్తున్న ఈ టైంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక ఈ నోటీసులతో మిగిలిన బిఆర్ఎస్ క్యాడర్లో కూడా ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని ఆందోళన మొదలైంది.
కాగా ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో ఇప్పటిలో ఆయనను తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.